Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'చంద్రముఖి' దర్శకునితో కాజల్ సినిమా?

తెలుగు .. తమిళ భాషల్లో 'చంద్రముఖి' సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమాను చాలామంది మరిచిపోలేదు. అలాంటి ఈ సినిమాకి పి.వాసు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇది ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ దర్శకుడు కథానాయిక ప్రాధాన్యతను కలిగిన మరో కథను సిద్ధం చేశాడట.

 ఇది కూడా తనదైన శైలిలో 'థ్రిల్లర్' కాన్సెప్ట్ తో కొనసాగుతుందట. ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రకి ఆయన కాజల్ ను అనుకుని ఆమెను సంప్రదించాడు. కథ పట్ల కాజల్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే మిగతా సినిమాల డేట్స్ చూసుకుని నిర్ణయం చెబుతానని అందని తెలుస్తోంది. కాజల్ ఓకే అంటే కనుక .. ఆమె ఖాతాలోకి ఓ వైవిధ్యభరితమైన సినిమా చేరిపోవడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. 
kajal

More Telugu News